*-జడ్చర్ల నియోజకవర్గం ఇంచార్జ్ జానంపల్లి అనిరుద్ రెడ్డి*
*పలు పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిక*
జనం సాక్షి జడ్చర్ల :
జడ్చర్ల నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే స్థానిక అభ్యర్థిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటేనే జడ్చర్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని కానీ జడ్చర్ల ప్రజలు స్థానికేతరులకు శాసనసభ్యులుగా అవకాశం ఇవ్వడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని పీసీసీ కార్యదర్శి జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జానంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు సోమవారం జడ్చర్ల పట్టణంలోని పాత బజారులో వివిధ పార్టీల నుండి సుమారు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుకు చెందిన పలు పార్టీలకు చెందిన శ్రేణులు కాంగ్రెస్ లో చేరుతుండడం శుభ పరిణామమని అన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని జడ్చర్లలో రైల్వే బ్రిడ్జి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాంగ్షన్ చెప్పించారని అక్కస్సుతోనే స్థానిక ఎమ్మెల్యే దాన్ని రద్దు చేపించారని ఆరోపించారు జడ్చర్లలో ఇంతవరకు నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు రేషన్ కార్డులు పెన్షన్లు వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదని జడ్చర్ల పట్టణంలోని రోడ్ల దుస్థితి అద్వానంగా ఉందని అన్నారు జడ్చర్ల నియోజకవర్గానికి స్థానికుడు ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు స్థానికేతురులను బహిష్కరించి స్థానిక నేతను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అంతకుముందుకు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న షకీల్, ఫాహద్, సలీం, అబ్రార్, షబ్బీర్ బృందానికి మహిళలకు కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మాజీ ఎంపీపీ నిత్యానందం పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




