Tuesday, 3 November 2026

*ఉరి వేసుకుని ఆత్మహత్య*

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూలై 19 :- జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సి ఆర్ పి ఎఫ్ అరుంధతి నగర్ లో మంగళవారం ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది బంధుమిత్రులు తెలిపిన వివరాలు ప్రకారం సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ మండల్ టోకర్ పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ జాకీర్ ఆహమద్ గత నాలుగు సంవత్సరాల క్రితం తన బావ అక్క నివాసం ఉంటున్న సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్ కు వలస వచ్చి జీవనం సాగిస్తున్న సమయంలో గత మూడు సంవత్సరాల క్రితం నగరంలోని తలాబ్ కట్టకు చెందిన సనా  బేగం అనే యువతితో వివాహం జరిగిందని ఈ ఇరువురు దంపతులకు పదునాలుగునెలల కుమారుడు కూడా ఉన్నాడని ఈమధ్య భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి భార్య తన పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధుమిత్రులు వివరించారు విషయం తెలుసుకున్న జవహర్ నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు