స్నేహమంటే ఇదేరా..
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బచ్చన్నపేట అక్టోబర్ 9 (జనం సాక్షి) 1999_2000 సంవత్సరంలో బచ్చన్నపేట మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు స్థానిక శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత ఒక చోట కలుసుకొని వారి పేరు చేస్తున్నటువంటి ఉద్యోగం చెప్పి పరిచయం చేసుకున్నారు ఒకరినొకరు పలకరించుకుంటూ పాత జ్ఞాపకాలను తలుచుకుని సంతోషాలను పంచుకున్నారు విద్యార్థుల స్థాయిని చూసిన ఉపాధ్యాయులు వారికి అభినందనలు తెలిపారు. తమతో చదువుకొని మరణించిన స్నేహితుల కుటుంబాలకు పదివేల రూపాయలు చొప్పున నాలుగు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి స్నేహమంటే ఇదేరా అనిపించుకున్నారు. అనంతరం. బ్రహ్మచారి. రామచంద్రం. చంద్రశేఖర్. రమేష్. పారిజాతం. ఓం ప్రకాష్. ఆంజనేయులు. వెంకటయ్య. ఉపాధ్యాయులకు సన్మానం చేసి వారి దీవెనలు తీసుకున్నారు