*స్నేహితురాలికి సహకరించిన స్నేహితుల బృందం*
స్నేహితురాలి భర్త చనిపోవడంతో ఆర్థిక సహాయం
మునగాల, అక్టోబర్ 18(జనంసాక్షి): తమ స్నేహితురాలి భర్త ఇటీవల అకాల మరణం చెందడంతో మేమున్నామంటూ ముందుకు వచ్చి తన చిన్ననాటి స్నేహితులు ఆమెకు ఆర్థిక సహాయం అందించిన సంఘటన మండలంలోని రేపాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న గడ్డం శ్రీలత భర్త రణబోతు వెంకటరెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంతో మరణించాడు. అయితే తనతో చదువుకున్న చిన్ననాటి మిత్రులందరికీ వచ్చి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. అంతేగాక ఆమెకు 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో షేక్ నాగుల్ మీరా, సారిక, కృష్ణ, వెంకటరెడ్డి, హనుమంతు, రమాదేవి, లింగరాజు, శిరీష, సతీష్, మీనాక్షి, శ్రీనివాస్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు