Wednesday, 4 November 2026

స్నేహితుల రోజు వేడుకల్లో బేతి , పన్నాల

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ లోని వార్డ్ కార్యాలయంలో స్నేహితుల రోజు వేడుకలు జరిపారు డివిజన్ శ్రేణులు.ఇట్టి కార్యక్రమానికి అతిధులుగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి హాజరు అయ్యి డివిజన్ నాయకులకు  బాండ్లు కట్టారు .అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ తప్పక స్నేహితులు ఉంటారు. మనం పుట్టే కుటుంబాన్ని, మన తల్లిదండ్రులను మనం ఎంచుకునే అవకాశం ఇవ్వని దేవుడు స్నేహితులను ఎంచుకునే అవకాశం మాత్రం మనకు ఇచ్చాడు. అందుకోసమే ఉత్తమమైన వ్యక్తులతో స్నేహం చేయాలని పెద్దలు చెబుతారు అని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ శ్రేణులు , నాయకులు పాల్గొన్నారు.