Tuesday, 3 November 2026

స్వచ్ఛ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : నగరంలోని పాఠశాలలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సంఘాలు, ¬టళ్లు, ఆస్పత్రులు, మార్కెట్‌ కమిటీలకు సెప్టెంబర్‌ నెలకు గానూ స్వచ్ఛ అవార్డులను ప్రదానం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఒక్కో కేటగిరికి ఐదు స్వచ్ఛ అవార్డులను అందజేయనుంది. ఇందుకు గానూ ఈ నెల 25వ తేదీ లోపు దరఖాస్తులను సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛ అవార్డులకు దరఖాస్తు చేసుకునే వారు వివరాలకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌ను లేదా డిప్యూటీ కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లను సంప్రదించాలని కమిషనర్‌ సూచించారు. ఈ అవార్డులకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చేలా పాఠశాలలు, ఆస్పత్రులు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సంఘాలు, మార్కెట్‌ కమిటీలు, ¬టల్స్‌ యాజమాన్యాలను చైతన్య పరచాలని కమిషనర్‌ ఆదేశించారు.