స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా పెద్దవంగర లో ర్యాలీ

పెద్దవంగర ఆగష్టు13(జనంసాక్షి):
భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా పెద్దవంగర పోలీస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామం  లో ర్యాలీ నిర్వహించారు.జాతి ఐక్యతను చాటి చెప్పే ఇంటింటా త్రివర్ణ పతాకంతో,మహనీయుల త్యాగల స్మరణతో,స్వతంత్ర్య సమరయోధుల నినానాదాలతో కస్తూరిబా స్కూల్ నుండి  తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కస్తూరిబా పాఠశాల విద్యార్థినులు, స్థానిక జడ్పిటిసి  శ్రీరామ్  జ్యోతిర్మయి,తెరాస మండల అధ్యక్షులు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం చైర్మన్, వెనుక దాసుల రామచంద్ర శర్మ, స్థానిక ఎంపిటిసి ఏదునూరి శ్రీనివాస్, జిల్లా అధికారులు,తహసీల్దార్ బి,రమేష్ బాబు, ఎంపిడిఓ బి, వేణుగోపాల్ రెడ్డి, ఎస్సై, రియాజ్ పాషా, కస్తూరిబా ఉపాధ్యాయులు, సర్పంచులు,ఎంపీటీసీలు, ఉప సర్పంచ్  లు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు  ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు  యూత్ నాయకులు గ్రామపంచాయతీ సిబ్బంది కార్యదర్శులు రెవిన్యూ సిబ్బంది ,కానిస్టేబుళ్ళు,తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు