స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొమరం భీం జయంతి వేడుకలు
రామన్నపేట అక్టోబర్ 22 (జనంసాక్షి) రామన్నపేట పట్టణ కేంద్రంలోని స్వర్ణకార సంఘ భవనంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణకార సంఘ అధ్యక్షులు కన్నేకంటి వెంకటేశ్వరాచారి అధ్యక్షతన సమావేశంలో కొత్త కార్యవర్గం ఎన్నుకొని, ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. మండల అధ్యక్షులు కన్నెకంటి వెంకటేశ్వరచారి మాట్లాడుతూ సంఘ పటిష్టతకు ప్రతి స్వర్ణకారుడు కృషి చేయాలని చెప్పి తెలంగాణ సాధనలో విశ్వకర్మల పాత్ర ఉన్నది తెలంగాణ సిద్ధించింది కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ కోశాన కూడా ఫలితం పొందలేదని, బహులార్ధ కంపెనీలను తీసుకొచ్చి మా కులవృత్తులను అంతం చేశారు. బ్రతుకుగడవక మావాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్షణమే మా వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు ఆకవరం శ్రీనివాసచారి మండల ప్రధాన కార్యదర్శి కాంజోజు శ్రీనివాసాచారి సహాయ కార్యదర్శి శ్రీరామోజు నరసింహచారి కోశాధికారి శ్రీపాద ఆదినారాయణ నాయకులు మారోజు రాఘవాచారి చోల్లెటి , చంద్ర శేఖరాచారి, కాన్జోజు పాండురంగచారి, చేపూరి నరసింహచారి, చోల్లేటి ప్రభాకరాచారి, శుభకోటి శ్రీకాంత్ చారి, అక్కినపల్లి ఉపేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.