ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
● యాదగిరిగుట్ట పట్టణంలో ఉత్సాహంగా ఫ్రీడమ్ రన్
● పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు
యాదగిరి గుట్ట. జనం సాక్షి
ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో వజ్రోత్సవ వేడుకలో భాగంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. విప్ సునీతామహేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువకులు, విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేబూని పరుగు తీసి దేశభక్తిని చాటుకున్నారు. జై భారత్, అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విప్ సునీతామహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. వివిధ దశలలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం మరువలేనిదన్నారు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యత చాటాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ట టౌన్ సీఐ సైదులు, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా వేడుకలు




