Wednesday, 4 November 2026

స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి

హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా  మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో వరంగల్ జిల్లా జనగామకు చెందిన సంధ్యారాణి (37), షాద్‌నగర్‌కు చెందిన షరీఫ్(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళ, శాంతినగర్‌కు చెందిన 34 ఏళ్ల పురుషుడు ఉన్నారు.

గాంధీ ఆస్పత్రిలో 50 మంది స్వైన్‌ఫ్లూ పాజిటివ్ చికిత్స పొందుతుండగా, వీరిలో ఇద్దరు మెడికోలు, 10 మంది చిన్నారులు, 15 మంది యువతీయువకులు, వృద్ధులున్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా మరో 15 మంది స్వైన్‌ప్లూ అనుమానంతో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 200 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *