స.హా.రక్షణ చట్టం జనగాం వైస్ ప్రెసిడెంట్ గా వాంక్డోత్ అనిత నియామకం
సమాచార హక్కు రక్షణ చట్టం జనగాం వైస్ ప్రెసిడెంట్ గా వాంక్డోత్ అనిత నియామకం.
జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్21: సమాచార హక్కు రక్షణ చట్టం (2005) స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిలువేరు కరుణాకర్ జనగాం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఆదర్శ న్యాయ కళాశాలలొ న్యాయ విద్యను అభ్యశిస్తున్న వాంక్డోత్ అనిత ను నియమించి ధ్రువీకరణ పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా అనిత మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మస్రం లాంటిదని అవినీతి పరుల గుండెల్లో సింహాస్వప్నం లాంటి ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి వీలుగా నాపై నమ్మకంగా ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ నా బాధ్యతను సమర్ధ వంతంగా నిర్వహిస్తు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి విసృతంగా అవగాహనా కల్పించడానికి సహాయపడుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు చెట్టబోయిన విద్యాసాగర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు మత్తోజు శ్రీను,వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పల్లకొండ భాస్కర్, వరంగల్ జిల్లా ఇంచార్జి శ్యామ్ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area