బిచ్కుంద అక్టోబర్ (జనంసాక్షి) మండలంలోని హజ్గుల్ గ్రామంలో గురువారం రోజున ఉదయము తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరుడు ఎడపల్లి మారుతి, ఉప సర్పంచ్ గంగవ్వ, ఎంపీటీసీ గోసం నారాయణ, సిద్ధప్ప, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు రచ్చ శ్రీకాంత్, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




