ఝరసంగం అక్టోబర్ 6 ( జనంసాక్షి) ఆదివారం ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమిని సందర్భంగా సద్దుల బతుకమ్మను మండల వ్యాప్తంగా ఉన్న ఝరాసంగం, బర్దిపూర్, కృష్ణాపూర్, మాచునుర్ మండలంలో ఉన్న 33 గ్రామాలలో సద్దుల బతుకమ్మను అత్యంత వైభవోపేతంగా శోభాయమానంగా మహిళలు సద్దుల బతుకమ్మ పండగను ఆడుతూ పాడుతూ వైభవంగా గ్రామాల్లో నిర్వహించారు. బతుకమ్మలకు ఐదురకాల నైవేద్యాలు పెరుగన్నం, చింతపండు కొబ్బరన్నం, తదితర నైవేద్యాలు బతుకమ్మ కు సమర్పించారు పోయిరావమ్మా బతుకమ్మ అంటూ బతుకమ్మను వేడుకుంటూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, ఝరాసంగం పోలీసులు పాల్గొని బందోబస్తు ఏర్పాటు చేశారు.




