హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు22:-
హనుమకొండ జిల్లా కార్మిక శాఖ ఉప కార్మిక కమిషనర్ గా బదిలీపై వచ్చిన డా.సామ్యేల్ జాన్ ను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర చైర్మన్ రాజారపు ప్రతాప్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాల ఇంచార్జి తాళ్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్ టౌన్ కన్వీనర్లు రాజారపు రాజు, వెళ్ది అనిల్ హనుమకొండ జిల్లా కలక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛము ఇచ్చి, శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్బంగా ఉప కార్మిక కమిషనర్ డా.సామ్యేల్ జాన్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరు లేబర్ కార్డు, ఈ – శ్రమ్ కార్డు తీసుకునేలా వాటి ఉపయోగాలను తెలియజేసే అవర్నెస్ ప్రోగ్రామ్ లు హెచ్.ఆర్.సి(కౌన్సిల్) ఆధ్వర్యంలో నిర్వహిచాలని తెలిపారు. అలాగే దళారి వ్యవస్థను అడ్డుకునేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలో కాజిపేటలో హెచ్.ఆర్.సి(కౌన్సిల్) ఆధ్వర్యంలో నిర్వహించే లేబర్ కార్డు ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ఉప కార్మిక కమిషనర్ డా.సామ్యేల్ జాన్, షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు కార్మిక రత్న యమడాల హనుకాంత్ లను హాజరై, సహకరించాలని ఈ సందర్బంగా హెచ్.ఆర్.సి(కౌన్సిల్) కోరడంతో డా.సామ్యేల్ జాన్ సానుకూలంగా స్పందించగా, కార్మిక రత్న యమడాల హనుకాంత్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేలేరు మండల అధ్యక్షులు కీర్తి సురేష్, వర్ధన్నపేట మహిళా విభాగం అధ్యక్షురాలు సౌరం ప్రియదర్శిని, వాలంటీర్లు మల్లమర్రి చరణ్, ప్రశాంత్ కొత్తూరి, బత్తిని రాజు, మల్లమర్రి శ్రీకాంత్, రాజు, రాచర్ల సతీష్, దాసరపు రాజు తదిరులు పాల్గొన్నారు.




