తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లాలో ఉన్న రజక ఉద్యోగులందరూ సంఘటితం కావాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అక్కినపల్లి పున్నయ్య అన్నారు.జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య కన్వీనర్ నిమ్మల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘ జిల్లా కార్యనిర్వహక మొదటి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.చదువులో ముందున్న రజక జాతి విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలన్నారు.సంఘ అభివృద్ధితో పాటు జాతి అభివృద్ధికి కూడా కృషి చేయాలని కోరారు.అనంతరం సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా నిమ్మల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా పొనుగోటి కోటయ్యలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్ఏం డాక్టర్ దామెర శ్రీనివాస్, పిల్లుట్ల శ్రీహరి, రాచూరి ప్రతాప్ , చెరుకు సింహాద్రి , జంజీరాల సైదులు, ఉల్లెందుల సైదులు, కిరణ్, రాంబాబు, నరసయ్య , నాగయ్య , శ్రీనివాస్, కోటయ్య , అంజయ్య , శ్యాంసుందర్ పుల్లయ్య , బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు.