Wednesday, 4 November 2026

*హనుమాన్ శక్తి హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్ చారి*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(29):* హనుమాన్ శక్తి హిందూధర్మ పరిరక్షణ సంస్థ వనపర్తి జిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు ఈ కమిటీ నూతన జిల్లా అధ్యక్షులుగా గోపాల్ పేట్ మండలం ఏదుట్ల గ్రామానికి చెందిన రాజేష్ చారి ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా సలేశ్వరం నియమించారు అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు గా లచ్చ గౌడ్, మంద తిరుపతిరెడ్డి లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ జిల్లాలో హనుమాన్ శక్తి హిందూ ధర్మ పరిరక్షణ కొరకు హిందూ ధర్మాన్ని కాపాడడం కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు అలాగే తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు