హమాలీ రేట్లు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో 9% పెంపు

టేకులపల్లి, అక్టోబర్ 17 ( జనం సాక్షి): టేకులపల్లి మండల హమాలి &మిల్లు వర్కర్స్ యూనియన్ (IFTU) ఆధ్వర్యంలో మండల వ్యాపారులకు, IFTU నాయకులకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. హమాలి రేట్లు గతంలో ఉన్న రేట్లు కు 9 శాతం పెంచుకోవడం జరిగింది అని సంఘం గౌరవ అధ్యక్షుడు బాణోత్. ఊక్లా, అధ్యక్షులు బోడ మంచ, కార్యదర్శిభూక్య బాలాజీ, కోశాధికారి దల్ సింగ్ తెలిపారు. ఈ హమాలి& మిల్లు వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పి ఓ ఎల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్, వాణిజ్య వ్యాపారులు కూచిపూడి నాగేశ్వరరావు, బొడ బాలు నాయక్, యన్. నరసింహారావు, సదానందం, వీరు తదితరులు పాల్గొన్నారు.