ఎల్బీ నగర్ (జనం సాక్షి ) పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిరంతరం కృషిచేస్తున్న సమత సేవా సొసైటి ఫౌండర్ చైర్మన్ గోనెమోని మంజుకుమార్ సేవలకు గుర్తింపుగా ఎకే తెలుగుమీడియా (ముంబై) వారు అందజేసిన హరితధీర పురస్కారాన్ని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్చంధ సేవకుల సేవలు వెలకట్టలేనివన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. తెలంగాణకు హరితహారంలో అందరు మొక్కలు నాటాలన్నారు నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలన్నారు. మంజుకుమార్ సేవలను అభినందిస్తూ శాలువాను కప్పి జ్ఞాపికను అందజేశారు. పురస్కార గ్రహీత మంజుకుమార్ మాట్లాడుతూ తమ సేవలను గుర్తించిన ఎకే తెలుగు మీడియా(ముంబై) అధినేత అశోక్ కంటే గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ స్పూర్తితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కురగంటి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 320డి జిల్లా చైర్మన్ హెల్త్ కేర్ డాక్టర్ బి విజయరంగా, యువనేత శరత్ చంద్ర, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఇండియన్ ఐకాన్ సేవ్ ఎర్త్ ఫౌండేషన్ చైర్మన్ టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
హరితధీర పురస్కారాన్ని అందుకున్న ట్రిబుల్ఎస్ ఫౌండర్ జిఎంకె




