ఎల్బీ నగర్( జనం సాక్షి ) ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ వాల్మీకి నగర్ కాలనీ లో ఈరోజు రామాయణ మహాకావ్యం రచయిత వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు మేతర్ సమాజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ లింగోజిగూడ డివిజన్ మాజీ అధ్యక్షులు కందికంటి శ్రీధర్ గౌడ్, సొసైటీ అధ్యక్షులు రాజుపాల్ సింగ్, ధర్మేందర్,జోగేందర్,సురేందర్, లోకేష్, సంజయ్, గణేష్, శివరాజ్, ముఖేష్,ఆకాష్, సునీల్ పాల్, సుభాష్, హరి నారాయణ సింగ్, పూనమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్




