హలో బహుజన ఛలో మునుగోడు

పానుగల్ అక్టోబర్ 08, జనంసాక్షి
హలో బహుజన ఛలో మునుగోడు కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి శనివారంరోజు బహుజన నాయకులు బయలుదేరి వెళ్లినట్లు బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కేశపాగ వెంకటేష్ తెలిపారు.
 బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్రలోభాగంగా మునుగోడు నియోజకవర్గంలో 22రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని,ఈ యాత్రలో భాగస్వామ్యం కావడానికి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఇన్చార్జ్ కేశపాగ వెంకటేష్ ఆధ్వర్యంలో మునుగోడుకు బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక వేళ బహుజనులను చైతన్యవంతులను చేసి,బహుజన రాజ్యం వస్తే, పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపవచ్చని తెలియజేయడానికి ఈ యాత్రలో ప్రధాన అజెండగా ఉంటుందని తెలిపారు. ఉప ఎన్నికల్లో బిఎస్పి పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన వారిలో జనరల్ సెక్రటరీ దర్గా స్వామి,కోశాధికారి కదిరపాడు కృష్ణయ్య,మండల అధ్యక్షుడు అంజి,ప్రధాన కార్యదర్శి మహేష్,మరియు కేతపల్లి గ్రామ అధ్యక్షుడు శివ తదితరులు ఉన్నారు.