వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘ 65వ వార్షికోత్సవ వేడుకలను ఈనెల 18, 19వ తేదీలలో వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మబిక్షం భవన్ లో జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.1957 అక్టోబర్ 18న గార్ల పట్టణంలో బొమ్మగాని ధర్మబిక్షం ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణమైందని, అప్పటి కమ్యూనిస్టు యోధులు చండ్ర రాజేశ్వరరావు, ఎస్ ఆర్ దాట్ల పాల్గొని ఈ సంఘాన్ని బలోపేతానికి కృషి చేశారని తెలిపారు.నాటి నుండి నేటి వరకు గీత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత గీత పనివారాల సంఘానికి ఉందన్నారు.జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.ఈ వార్షికోత్సవాలను అన్ని మండలాల్లో ఘనంగా జరుపాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షులు రేగటి లింగయ్య , నాయకులు మాజీ కౌన్సిలర్ దోరేపల్లి శంకర్, బొడ్డు రామచంద్రయ్య , జిల్లా సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, గోపగాని రవి తదితరులు పాల్గొన్నారు.