బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఆలియా భట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రీసెంట్ గా గంగూబాయి కతియావాడీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆలియా బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ తో తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ మిల్కీ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో ఆఫర్ ను దక్కించుకుంది. అది కూడా అక్కడి స్టార్ హీరోయిన్ గాల్ గడోట్ నటించబోయే మూవీలో పాత్ర దక్కడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ నిర్మించనున్న ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ ’హార్ట్ ఆఫ్ స్టోన్’లో ఆలియా కీలక రోల్ లో యాక్ట్ చేసే ఛాన్స్ ను కొట్టేసింది. అయితే ఆలియా పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ’వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గడోట్ గూఢచారిగా నటించనుంది.




