Tuesday, 3 November 2026

ఐటమ్‌ సాంగ్‌తో బాలీవుడ్‌లోకి రష్మిక

సినీరంగంలో కొందరు హీరోయిన్లకు క్రేజ్‌ రావడానికి చాలా సమయం పడుతుంది. మరికొందరు మాత్రం ఒకటీ, రెండు సినిమాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. రష్మిక మందన్న కూడా ఇదే కోవలోకి వస్తుంది. తెలుగులో ’ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటి మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఇక తర్వాత వచ్చిన ’గీతాగోవిందం’ సినిమాతో టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఈమె బాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌ చేయనున్నట్లు ఫిలిం నగర్‌ వర్గాల్లో టాక్‌. సందీప్‌ రెడ్డి వంగా
దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ’యానిమల్‌’. ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌ కోసం మేకర్స్‌ రష్మికను సంప్రదించారట. దీనికి ఆమె కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఈమె సిద్దార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న’ మిషన్‌ మజ్నూ’తో పాటు ’గుడ్‌ బాయ్‌’ సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఈమె నటించిన ’ఆడవాళ్లు విూకు జోహార్లు’ సినిమా గత శుక్రవారం విడుదలై పాజిటీవ్‌ రివ్యూలను సొంతం చేసుకుంది.