హాసకొత్తూరు గ్రామంలో చేప పిల్లల పంపిణీ

కమ్మర్పల్లి21అక్టోబర్(జనంసాక్షి) కమ్మర్పల్లి మండలంలోని హాసకొత్తూరు గ్రామంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా ఉచితంగా మూడు లక్షల 12 వేల చేప పిల్లలను అందజేశారు. చేప పిల్లలను గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ గ్రామంలోని మూడు చెరువులలో విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రామ గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి రాజేందర్ గ్రామ ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ ,గంగపుత్ర సంఘ సభ్యులు జనార్ధన్ ,ఎల్లాల గణేష్, జుంబరాత్, అంజయ్య ,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.