‘హీరో’ సైకిల్ స్థాపకుడు కన్నుమూత..

లుధియాన : ‘హీరో’ సైకిల్ వ్యవస్థాపకుడు ప్రకాష్ ముంజల్ (87) కన్నుమూశారు. గురువారం లుధియానలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని వెల్లడించారు. ముంజల్ కు ఒక కుమారుడు, నలుగురు కూతుర్లున్నారు.