Tuesday, 3 November 2026

హుసేన్‌ సాగర్‌ను రక్షించుకుందాం

హైదరాబాద్‌: కాలుష్యం నుంచి హుస్సేస్‌సాగర్‌ను పరిరక్షించుకోవాలని హైదరాబాద్‌లో భరీ వాక్‌ నిర్వహించారు. ఇండియాన్‌ ఆర్మీ, 92.7 బిగ్‌ ఎఫ్‌. ఎమ్‌.ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో  కొనసాగిన ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు, మిలటరీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెక్లెస్‌ రోడ్డులోని సంజీవయ్య పార్కు  నుంచి సెయిలింగ్‌ క్లబ్‌ వరకు  కొనసాగిన  వాక్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. టాలీవుడ్‌ నటులు మనోజ్‌కుమార్‌, మంచులక్ష్మీ ప్రసన్నలు ప్రసంగాలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. హుస్సేస్‌సాగర్‌, పరిసరాలను పరిశ్రుభంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హైదరాబాద్‌కు ఆభరణం లాంటి సాగర్‌ను కాపాడుకునేందుకు వ్యర్థాలను చెరువులో పడేయకుండా మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *