Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో దారుణహత్య

హైదరాబాద్‌ : రాజధాని నగరంలో పట్టపగలు దారుణహత్య చోటుచేసుకుంది. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంకర్‌నగర్‌లో బర్కత్‌పుర డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఉపేంద్రాచారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలు హత్య జరగడంతో స్థానికులు, దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *