Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ… తెరాస తల పెట్టిన బంద్‌ హైదరాబాద్‌లో పాక్షికంగా కనబడుతోంది. కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో షాపులు మూసివేశారు. ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా యథాతథంగా నడుస్తున్నాయి. ఉదయం నుంచీ నగరంలో బస్సులు, అటోలు, ఇతర వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. చలో అసెంబ్లీ కారణంగా కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడిన ఉద్యోగులు బస్సుల రాకపోకలతో వూపిరి పీల్చుకున్నారు. ఒక రోజు విరామం తర్వాత విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్నారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిన్నటి చలో అసెంబ్లీ సందర్భంగా మోహరించిన బలగాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బంద్‌ను దృష్టిలో ఉంచుకుని మిగతా ప్రాంతాల్లోనూ పహారా కాస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *