Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ):  నగరంలోని వనస్థలిపురం పిఎస్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పనామా వద్ద ఉన్న రైతు చికెన్‌ బజార్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ కాస్తా ఒకరి చావుకు దారితీసింది. గిరి అనే వ్యక్తిని కృష్ణ చైతన్య దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని వాటర్‌ డ్రమ్‌లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కృష్ణచైతన్య దొరికితే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.