హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులో 10కేరన్ నిర్వహించారు. ఇవాళ ఉదయం నిర్వహించిన రన్ కార్యాక్రమానికి శాసన సభా స్పీకర్ నాదెండ్ల మనోమర్ హాజరయ్యారు. ఆయన జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ రన్లో పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, విదేశీ అథ్లెట్లు, వేల మంది యువతీ యువకులు పాల్గొన్నారు. విజేతలకు కేంద్ర మంత్రి చిరంజీవి బహుమతులు ప్రధానం చేశారు. రన్ సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డు వైపు దారి తీసే రోడ్లపై ట్రాఫిక్‌ను మళ్లించారు.




