పార్టీ అభ్యర్థలుకు ఓటేయాలని బాబు వినతి
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): హైదరాబాద్ నగరం సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్విటర్‌లో కోరారు. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్‌లను నగరానికి తీసుకువచ్చి ఐటీ కంపెనీలను స్థాపించిన ఘనత తమదేనని అన్నారు. ఐటిపరంగా హైదరాబాద్‌ను అభివృద్ది చేశామని అన్నారు. ప్రజాశ్రేయస్సు పట్ల తమకున్న ఆకాంక్షల ఫలితమే సైబరాబాద్ అన్నారు. హైటెక్‌సిటీ, ఔటర్ రింగ్‌రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జినోమ్ వ్యాలీ.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది టీడీపీయే అన్నారు. ఉపాధి కల్పన, సంపదసృష్టి, సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగి ఎన్నో కుటుంబాల్లో వెలుగునింపామన్నారు. మళ్లీ నగరానికి పూర్వవైభవం రావాలంటే ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేసి, టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ట్విటర్‌లో కోరారు.




