హైదరాబాద్ (జనంసాక్షి ) : కొందరు మతాన్ని అడ్డు పెట్టుకొని దేశాన్ని అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, రెచ్చగొట్టే ప్రసంగాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. బోరబండలో అక్బరుద్దీన్ ప్రసంగంపై విచారణ జరిపించాలని, హైదరాబాద్‌లో భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉంటున్న వారి భద్రత గురించి కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్న తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ కోరారు.




