హైదరాబాద్, : హైదరాబాద్, మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసులు ప్రతి ఇంటినీ తనికీ చేశారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగరంలోని ఆయా ఏరియాల్లో స్థానిక పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారు.




