హైదరాబాద్ తరలి వెళ్లిన ప్రజాప్రతినిధులు అధికారులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): గత పక్షం రోజుల పాటు అట్టహాసంగా కొనసాగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు సూర్యాపేట జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సోమవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు.హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించే ముగింపు సంరంభానికి జిల్లా నుండి 200 మందికి పైగా ఐదు బస్సులలో బయలుదేరి వెళ్లారు.ఈ మేరకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.అధికారులతో పాటు ఎంపీపీలు, జెడ్పిటీసీలు, పలు ఆలయాల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.