హైదరాబాద్: నగరంలోని నార్సింగ్ వెస్టర్న్ కాలనీ శ్రీ విల్లాలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి ఓనర్ ను, వాచ్ మెన్ ను బంధించి చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఇంటి ఓనర్ కారులో వారు పారిపోయారు. అయితే ఎంత నగదును దోచుకెళ్లారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ దొంగతనంతో అంతరాష్ట్ర ముఠాకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా?లేక ఇది తెలిసిన వారి పనా?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదిలా ఉండగా దుండగులు ఎత్తుకెళ్లిన కారును ఇంటి శివారులో వదిలి వెళతామని దుండగులు తెలిపినట్లు తెలుస్తోంది.




