హోరా,హోరీగా సాగిన పోరు
మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షునిగా గొల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా పిండి సందీప్ కుమార్
మానకొండూరు ఆర్ సి, సెప్టెంబర్ 23( జనం సాక్షి)
మానకొండూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో గొల్ల శ్రీనివాస్ ముదిరాజ్ వర్గం విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి గొల్ల శ్రీనివాస్, నెల్లి శ్రీనివాస్ ముదిరాజులు పోటీపడ్డారు. ఉపాధ్యక్ష, కార్యదర్శి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉపాధ్యక్షునిగా పిండి సందీప్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా దయ్యాల మల్లయ్యలు ఎన్నికయ్యారు. అధ్యక్ష స్థానానికి పోటీ పడిన గొల్ల శ్రీనివాస్ కు ఆరు ఓట్లు రాగా, నెల్లి శ్రీనివాస్ కు 3 ఓట్లు వచ్చాయి. మొత్తం 399 మంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులున్నారు. మొత్తం పోలైన ఓట్లు 334 కాగా ఇందులో 8 ఓట్లు చెల్లకుండా పోయాయి. డైరెక్టర్లుగా బండి అనిల్ ముదిరాజ్, నెల్లి శ్రీనివాస్ ముదిరాజ్, గట్టు సతీష్ కుమార్ ముదిరాజ్, నెల్లి మల్లేశం ముదిరాజ్ ,దయ్యాల మల్లయ్య ముదిరాజ్, బొగ్గుల శంకర్ లు ఎన్నికయ్యారు. తొమ్మిది డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగగా 17 మంది పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో గొల్ల శ్రీనివాస్ వర్గం విజయం సాధించగా సంబరాల్లో మునిగిపోయారు.