Thursday, 5 November 2026

హ్యాండ్లూమ్(చేనేత) వస్త్రాల మ్యూజియంను ప్రారంభించిన : ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్( జనం సాక్షి  )పద్మశ్రీ గజం గోవర్ధన  తాను రూపొందించిన మరియు ప్రపంచంలో అనేక దేశాల్లో సేకరించి,దిల్ సుఖ్ నగర్ నందు వారి నివాసంలో ఎర్పాటు చేసిన హ్యాండ్లూమ్(చేనేత) వస్త్రాల మ్యూజియంను గురువారం  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా గోవర్ధన  తాను స్వయంగా రూపొందించిన మరియు వివిధ దేశాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చి తయారు చేయించిన అనేక రకాల వస్త్ర డిజైన్లు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి కి చూపించి,వాటి కళాత్మక నైపుణ్యన్నీ వివరించారు.అలాగే వాటిని రూపొందించే విధానాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ చేనేత రంగంలో స్వయం ప్రతిభతో అనేక డిజైన్లు రూపొందించి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడం,అలాగే భావి తరాలకు పనికివచ్చే విధంగా ఎంతో వ్యయ ప్రయసాలకు ఓర్చి హ్యాండ్లూమ్ మ్యూజియంను ఎర్పాటు చేయడం అభినందనీమని,వారు ఎల్.బి.నగర్ వాస్తవ్యులు కావడం గర్వించదగ్గ విషయం అని తెలిపారు.ఇకముందు వారు చేనేతను ఇంకా అభివృద్ధి పధంలో తీసుకువెళ్లాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ గడ్డి అన్నారం   డివిజన్ తెరాస అధ్యక్షులు శ్రీశైలం యాదవ్   ,రమేష్ ముదిరాజ్,వున్న శ్రీనివాస్,  , పటేల్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.