• రైతు వేమ రాములు కుటుంబానికి మండల అధ్యక్షుడు రణం భరోసా
దౌల్తాబాద్, సెప్టెంబర్ 1, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిన్న రాత్రి కోళ్ల ఫారం వద్ద వేమ రాములు అనే రైతు విద్యుత్ షాకు తో మరణించిన విషయం తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్ర పాల్గొన్నారు. తక్షణమే విద్యుత్ మరియు వ్యవసాయ అధికారులతో ఫోన్ లో మాట్లాడి రైతు భీమా త్వరిత గతిన అందేవిధంగా చూడాలని కోరారు. మృతుడు రాములు కుటుంబికులను ఓదార్చి అధైర్యపడొద్దని,ప్రభుత్వ పరంగ అన్నీ విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.