Thursday, 5 November 2026

10వ వార్డులో ట్యాంకర్ ద్వారా త్రాగునీటి సరఫరా చేయించిన మున్సిపల్ కౌన్సిలర్.,.

  జనంసాక్షి ,కొత్తకోట, జూలై 26,                  కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని 10 వ వార్డులో ఆ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య మున్సిపాలిటీ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేసి త్రాగునీటి సమస్యను తీర్చారు.గత నాలుగు రోజులుగా కొత్తపల్లి నుండి కొత్తకోటకు త్రాగునీరు సరఫరా చేసే పైప్లైన్ పగిలిపోవడంతో వార్థులో త్రాగునీటి సమస్య ఏర్పడగా ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేషిని విశ్వేశ్వర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి ట్యాంకర్ ద్వారా మున్సిపల్ టాక్టర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయించడానికి ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజల తరఫున దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పొగాకు సుకేషిని విశ్వేశ్వర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఆ వార్డు కౌన్సిలర్ ఎరుకలి తిరుపతయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
 
Attachments area