Tuesday, 3 November 2026

11న మండలి ఛైర్మన్‌ ఎన్నిక

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9  శాసన మండలి బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 11వ తేదీన శాసన మండలి ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు మండలి సమావేశాలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. వచ్చే బ్జడెట్‌ సమావేశాలు 21 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించాం. ఈ నెల 24వ తేదీన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌ కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ ఏర్పాటుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.