11 వార్డు లో బతుకమ్మ, ఆసరా పింఛన్ కార్డ్ ల పంపిణీ

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం
ఖానాపూర్ రూరల్ 28 సెప్టెంబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపాలిటీ లోని పదకొండవ వార్డు లో బుధవారం రాజీవ్ నగర్ అంగన్వాడి కేంద్రం లో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం అరుహులైన వారికి బతుకమ్మ చీరలు,ఆసరా పింఛన్ కార్డ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సంబరాలు అడపడుచులందరు ఘనంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో షబీర్ పాషా,వార్డు ఆఫీసర్ చేతన్,మెప్మా రామలక్ష్మి, సునీత,రాజేందర్, కాలనీవాసులు పాల్గొన్నారు.