Wednesday, 4 November 2026

11, 12 తేదీల్లో డీసీసీ అధ్యక్షుల సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు ఏఐసీసీ ఇటీవల నియమించిన వివిధ కమిటీలు, డీసీసీ అధ్యక్షులతో ఈనెల 11, 12 తేదీల్లో గాంధీభవన్‌లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. 11న ఉదయం 11 గంటలకు 31 జిల్లాల అధ్యక్షులు, నగర, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు విూడియా సమన్వయ కమిటీ సమావేశం, 2.30 గంటలకు పబ్లిసిటీ కమిటీ సమావేశాలుంటాయి. సాయంత్రం 4 గంటలకు క్యాంపెయినింగ్‌ కమిటీ, 5.30కి ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేశారు. 12న మధ్యాహ్నం  3 గంటలకు కీలకమైన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ జరుగుతుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు, సీఎల్పీనేత మల్లు భట్టివిక్రమార్క, కమిటీల ఛైర్మన్లు, కన్వీనర్లు, ముఖ్య నేతలు పాల్గొంటారు.