Wednesday, 4 November 2026

హర్యానాలో స్వచ్ఛతపై 12న సదస్సు

ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోడీ
తరలి వెళ్లిన పలువురు  సర్పంచ్‌లు
హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 12న హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో స్వచ్ఛత శక్తి-2019 సదస్సును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై స్వచ్ఛతపై ప్రసంగించనున్నారు. సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 135 మంది సర్పంచులు, స్వచ్ఛ గ్రాహీలు హాజరు కానున్నారు. సదస్సులో స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. కేంద్రం చేస్తున్న స్వచ్ఛభారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా గ్రావిూణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా వారికి అవగాహన కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి జిల్లా నుంచి ఐదుగురు మహిళలను ఎంపిక చేయాల్సి ఉంది. ఐదుగురిలో ముగ్గురు సర్పంచులు, మహిళా పొదుపు స్వయం సహాయక సంఘాలు, ఆశా కార్యకర్తల నుంచి ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో పాల్గొనే  జిల్లా సర్పంచులు, మహిళా సంఘ సభ్యులకు ఆహ్వానం అందింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు సర్పంచులు, స్వశక్తి సంఘ సభ్యులను జిల్లా కలెక్టర్‌, డీఆర్డీవోలు కలిసి ఎంపిక చేశారు. వారితో కలిసి హరియాణా బయల్దేరారు. స్వచ్ఛత సదస్సుకు తరలి వెళ్లినవారిలో కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సిర్సపల్లి సర్పంచి ఎడ్ల సువర్ణ, సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి సర్పంచి అబ్బిడి పద్మ, వీణవంక మండలం కోర్కల్‌ జీపీ నర్సింహులపల్లి సర్పంచి అలుగువెల్లి నీరజ, కరీంనగర్‌ మండలం దుర్శేడుకు చెందిన స్వశక్తి సంఘ మహిళ తంగళ్లపల్లి లావణ్య ఉన్నారు. వీరితో పాటుగా స్వచ్ఛభారత్‌ హెచ్‌ఆర్డీ కన్‌స్టలెంట్‌ రమేశ్‌ వెంట ఉన్నారు. అలాగే మహబూబాబాద్‌ జిల్లా నుంచి ముగ్గురు మహిళా సర్పంచులు ఎంపికయ్యారు. వీరితో
పాటు మరో ఇద్దరు ఐకేపీకి చెందిన  స్వచ్ఛగ్రాహీలు ఎంపికయ్యారు. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ స్టేట్‌ స్వచ్ఛ భారత్‌ మిషన్‌, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు విద్యావంతులైన యువ మహిళా సర్పంచులను ఎంపిక చేశారు. మహబూబాబాద్‌ మండలంలోని చోక్లాతండా సర్పంచి గుగులోత్‌ ప్రియాంక, మరిపెడ మండలం తానంచర్ల సర్పంచి దిగ్గజర్ల శ్వేతాఝాన్సీ, తొర్రూరు మండలం చెర్లపాలెం సర్పంచి సట్ల నాగమణిని ఎంపిక చేశారు. అలాగే మహిళా స్వయం సహాయ సంఘాల నుంచి బయ్యారం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఐకేపీ స్వచ్ఛగ్రాహీ కె.సుగుణ, గంగారం మండలం కోమట్లగూడె పంచాయతీకి చెందిన ఈసం రమ ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బయల్దేరి వెళ్లారు. ఉచిత రవాణా, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖాధికారి సూర్యనారాయణ తెలిపారు.  ఈ జాతీయ సదస్సుకు పాలమూరు జిల్లా నుంచి అయిదుగురు మహిళలను జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు ఎంపిక చేశారు. వారిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో డీఆర్‌డీవో క్రాంతి అభినందించారు. తెలంగాణ నుంచి మొత్తం 132 మంది మహిళా ప్రతినిధులను పంపుతున్నారు. వారు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి పయనమయ్యారు. తిరిగి 15వ తేదీ హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఎంపిక అయినవారిలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, కోశాధికారి రాణి, మహబూబ్‌నగర్‌ మండలం  చౌదర్‌పల్లి సర్పంచి శంకరమ్మ, నవాబుపేట మండలం కొండాపూర్‌ సర్పంచి బుజ్జమ్మ, భూత్పూర్‌ మండలం హస్నాపూర్‌ సర్పంచి రాములమ్మ తదితరులు ఉన్నారు. సదస్సుకు ఎంపికైన నిర్మల్‌ జిల్లాకు చెందిన సర్పంచులు, స్వయం సహాయక సభ్యులు తరలివెళ్లారు. జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. వెళ్లిన వారిలో కుంటాల, లోకేశ్వరం మండలం కిష్టాపూర్‌, సారంగాపూర్‌ మండలం చించోలి (బి) గ్రామాల సర్పంచులు సమత, శైలజ, చాట్ల లక్ష్మి, సారంగాపూర్‌ మండలం ఆలూర్‌, లోకేశ్వరం స్వయం సహాయం సంఘాల సభ్యులు భూలక్ష్మి, లావణ్యలతో పాటు అధికారులు ఉన్నారు.