Thursday, 5 November 2026

పీఆర్సీ ఎందుకు వేయట్లేదు? 

– కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రావణ్‌
హైదరాబాద్‌, మే12(జ‌నం సాక్షి ) : ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ ఆరోపించారు. ఉద్యమంలో ఉద్యోగులు తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని, ఉద్యోగుల తరఫున ఎలాంటి పోరాటానికైనా కాంగ్రెస్‌ సిద్ధం అని ప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడిన శ్రావణ్‌.. పీఆర్సీ వేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్టాన్రికి రప్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉండరని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన శ్రావణ్‌.. ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.