12న విడుదలవుతున్న మాచర్ల నియోజకవర్గం

నితిన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ ’మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను ఇచ్చిది చిత్రబృందం. ప్రముఖ ఎడిటర్‌ ఎం ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తొలిసారిగా ఈ మూవీ ద్వారా మెగా ఫోన్‌ పడుతున్నారు. ఇందులో నితిన్‌ సరసన క్యాథరీన్‌ థ్రెసా , కృతి శెట్టి హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. గత ఏడాది నితిన్‌ నుంచి వచ్చిన ’రంగ్‌ దే’, ’చెక్‌’ సినిమాలి ఆశించిన విజయాలను ఇవ్వలేకపోయాయి. దాంతో ఇప్పుడు నటిస్తున్న ’మాచర్ల నియోజకవర్గం’ మూవీతో హిట్‌ కోట్టాలనే కసితో ఉన్నాడు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఆదిత్య మూవీ ఎంట్టంల్గªన్మెంట్స్‌, శ్రేష్ట్‌ మూవీస్‌ సంస్థలపై భారీ బ్జడెట్‌తో ఈ మూవీని నిర్మిస్తుండగా, దీనికి మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్‌ కలెక్టర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌ అంజలి ఒక మాస్‌ సాంగ్‌ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. మాస్‌ ఆడియన్స్‌ కోసమే అనేట్టుగా ఉన్న ఈ సాంగ్‌ సినిమాకి బాగా హైలెట్‌ అవుతుందనీ మేకర్స్‌ చెబుతున్నారు. ’రా రెడ్డి ఐయాం రెడీ’ అనే పల్లవితో సాగె ఈ సాంగ్‌ ప్రోమో ఇప్పటికే యూట్యూబ్‌ లో సూపర్‌ గా రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న మాచర్ల నియోజకవర్గం మూవీని ఆగస్టు 12న విడుదల భారీ స్థాయిలో రిలీజ్‌ చేయబోతున్నారు.