12వ రోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 5 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె 12వ రోజుకు కొనసాగిస్తున్నారు.వీఆర్ఏలు ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు లక్ష్మన్న మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి,వీఆర్ఏ మండల అధ్యక్షుడు పుర్ర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్ ,వినోద్ ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.