– రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక
– అలాంటిదేవిూ లేదన్న కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జులై6(జనం సాక్షి ) : ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే వారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల13న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విస్తృత ప్రచారం సాగుతుంది. పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని కాంగ్రెస్ పార్టీలోని
పలువురు పేర్కొంటున్నారు. 13న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని.. ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్‌గాంధీ నల్లారికి అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం. అయితే కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇలాంటి వార్తలు తాను టీవీ ఛానళ్లలోనే చూస్తున్నానని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రత్యే తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటును తీవ్రగా వ్యతిరేకించారు. తెలంగాణ ఏర్పాటుతో పార్టీ నష్టపోతుందని కాంగ్రెస్ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. అయినా తెలంగాణ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరం కావడంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణను ప్రకటించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకిరాజీనామాచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి 2014 ఎన్నికల సమయంలో కొత్త పార్టీని స్థాపించారు. ఎక్కడా సీట్లు రాకపోవటంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా ప్రస్తుతం ఏపీలో ప్రత్యేక ¬దా ఉద్యమం ఉదృతం అవుతుండటం, త్వరలో ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల సుబ్బిరాంరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్‌లు కిరణ్‌కుమార్‌రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ఈ నెల 13న కిరణ్‌కుమార్ రెడ్డి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
————————————————




