కూటమి నాయకులకు తగిన బుద్ది చెప్పాలి
ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద
వెల్గనూర్‌లో ప్రజా ఆశీర్వాద యాత్ర బహిరంగ సభ, పలువురి చేరికలు
దండేపల్లి, నవంబర్ 25, (జనంసాక్షి) :
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ప్రతి పక్షాలతో ఏర్పడిన కూటమి మహాకూటమి కాదని అది ప్రాజెక్టులను ఆపే కూటమి అని ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద, మంచిర్యాల నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందర్‌రెడ్డి అన్నారు. దండేపల్లి మండలం వెల్గనూర్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర బహిరంగ సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్రలు పనుతున్నాయన్నారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలు పొత్తు పేరుతో మహాకూటమి పెట్టుకోవడం శోచనీయమన్నారు. పేద ప్రజలు సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మీ షాదిముబారక్, రైతుబంధు, రైతు భీమా పథకాలను ప్రవేశ పెట్టి దేశంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు. భూకాబ్జాలకు పాల్పడిన ప్రేమ్‌సాగర్‌రావును ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో రౌడీల పాలన కొనసాగుతుందని వారు అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు వారు పేర్కోన్నారు. రైతుబంధు, రైతు భీమా పథకాలు దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ మహాకూటమికి ప్రజలే తగ్గిన బుద్ది చెప్పాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని చూచి టిఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి రెండోసారి టిఆర్‌ఎస్ పార్టీకి పట్టాం కట్టాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు మహాకూటమి పేరు వస్తున్నారని వారి మాటలు నమెమ్మద్దన్నారు. నిరంతరం పని చేస్తే పార్టీ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి 24 గంటల పాటు నిరంతరం విద్యుత్, రైతుబంథు, రైతు భీమా పథకాలను అమలు చేసింది టిఆర్‌ఎస్ పార్టీయే అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి టిఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రెండు పంటలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం పలు పార్టీల నుండి టిఆర్‌ఎస్ పార్టీలో మహిళలు, యువకులు, గ్రామస్తులు చేరారు. వీరికి వారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కన్వీనర్ మోటపలుకుల గురవయ్య, ఎంపిపి గోళ్ల మంజుల, జెడ్పీటిసి భూక్య యశ్వంత్ నాయక్, వైస్ ఎంపిపి రాజేందర్, సహకార సంఘం చైర్మన్ గడ్డం శ్రీనివాస్, ఎంపిటిసి ముత్తె నారాయణ, పార్టీ అధ్యక్ష కార్యదర్శి బండారి మల్లేష్, రేణి శ్రీనివాస్, నాయకులు ముత్తె రాజమల్లయ్య, లింగాల తిరుపతి ,అక్కల రవీందర్, చిట్ల శ్రీనివాస్, గోపతి రాజన్న, వెంగళ్‌రావు, రాజమల్లు, మెంగని సత్తయ్య, భూమయ్య, శంకర్‌రావు, గంగయ్య, సతీష్, బుచ్చయ్య, సత్తయ్య, జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, రమేష్, సురేందర్, లక్ష్మన్, రవి, రాజయ్య, బాపు, గంగారెడ్డి, శంకర్,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




