Tuesday, 3 November 2026

చిల్లేపల్లి సహకార సంఘం అక్రమాలపై విచారణ జరిపించాలి

ఫొటో రైట్ అప్.సమావేశంలో మాట్లాడుతున్న చిన వెంకట్ రెడ్డి.

నేరేడుచర్ల( జనం సాక్షి ) న్యూస్ :- మండల పరిధిలోని చిల్లేపల్లి సహకార సంఘం పై ధాన్యం కొనుగోలు విషయంలో వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని నేరేడుచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొనతం చిన వెంకటరెడ్డి అన్నారు.మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సొసైటీలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని చాలామంది రైతులు ఆరోపణలు చేస్తున్నారని,రైతులకు జరగాల్సిన లబ్ధి సొసైటీ చైర్మన్ లకు దక్కడం చాలా బాధాకరమని,రైతు ప్రభుత్వం అని పదేపదే చెప్పుకునే టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ చైర్మన్లుగా ఉంటూ సొసైటీల్లో భారీ అక్రమాలు జరిగినట్లు అనేక పత్రికల్లో చూస్తున్నామనీ.ఈ మధ్యనే పెంచికల్ దిన్నె సొసైటీ మీద వచ్చిన ఆరోపణలు మరువక ముందే ఇదే మండల పరిధిలోని చిల్లేపల్లి గ్రామం సొసైటీ మీద ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని,చైర్మన్లుగా రైతులు ఎన్నుకుంటే రైతుల బాగోగులను గురించి ఆలోచించకుండా,చైర్మన్లుగా వ్యాపారస్తులను,కాంట్రాక్టర్లను ఎన్నుకుంటే ఇలాంటి అవినీతే జరుగుతుందని ఘాటుగా విమర్శించారు.స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా మంత్రివర్యులు తప్పనిసరిగా రైతుల పక్షాన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ఆరోపణల పై కమిటీ జిల్లాస్థాయిలో వేసి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చేయాలని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తీసుకురావాలని రైతుల పక్షాన మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు బచ్చలకూరి ప్రకాష్,కృష్ణమూర్తి, పిచ్చిరెడ్డి,కౌన్సిలర్లు రణపంగు నాగయ్య,పీఏసీఎస్ డైరెక్టర్లు తాళ్ల సురేష్ రెడ్డి,చిన్న రామకృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు నాయక్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీను,ఇంజమూరి శ్రీను, కాశీ తదితరులు పాల్గొన్నారు.