Tuesday, 3 November 2026

ఈ రోజు విశ్వహిందూ పరిషత్ మెటుపల్లి శాఖ ఆధ్వర్యంలో

మెట్ పల్లి జనంసాక్షి న్యూస్

కర్ణాటకలో జరిగిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యను ఖండిస్తూమెట్ పల్లి పాత బస్ స్టాండ్ వద్ద
హంతకుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విష్వహిందూ పరిషత్ జగత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పోహార్ తుక్కారం గారు మాట్లాడుతూ.. కర్ణాటక లోని శివమొగ్గ నగర బజరంగ్ దళ్ కో కన్వీనర్ అయిన హర్షా అనే కార్యకర్తను టార్గెట్ చేసి అక్కడి ముష్కర మూకలు కత్తులతో దాడి చేసి అతిదారుణంగా చంపారని, హిందూసమాజ సంఘటితం కోసం పనిచేస్తున్న హర్షపై కావాలనే ఒక పథకం ప్రకారం ఒక మతానికి చెందిన ఉన్మాదులు కత్తులతో కర్రలతో కిరాతకంగా దాడిచేసి కొట్టి చంపారని తెలిపారు.. ఇలాంటి దాడులవల్ల దేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలని PFI, SDPI లాంటి ఇస్లామిక్ సంస్థలు కుట్రలు చేస్తుందన్నారు. ఈ దాడులకు బజరంగ్ దళ్ కార్యకర్తలు బయపడరని, దేశ శ్రేయస్సు కోసం ధర్మ,రక్షణ కోసం బజరంగ్ దళ్ పనిచేస్తుందన్నారు. ఏవరైతే హర్షా పై దాడిచేసి హత్య చేశారో వారిని భారత ప్రభుత్వం బహిరంగంగా ఉరితీయలని అన్నారు. హత్యకు గురికాబడ్డ బజరంగ్ దళ్ కార్యకర్త కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం 50లక్షల ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని కొరారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ కార్యదర్శి మర్రిభాస్కర్,నగర కార్యదర్శి వేములవాడ రాజశేఖర్,భగత్ చంద్రశేఖర్, బజరంగ్ దళ్ జిల్లా సురక్ష ప్రముఖ్ ఓదెల నరేష్, బజరంగ్ మెటుపల్లి ప్రఖండ ప్రముఖ్ గన్నారపు వినయ్, ప్రచార ప్రముఖ్ పందిగిరి శ్రీనివాస్, విద్యార్థి ప్రముఖ్ కట్ట మహేష్,కల్లూరి అశోక్,నితీష్ హిందువాహిని నాయకులు వాగిలే వంశీ,దురిశెట్టి గిరిధర్,శ్రీనాథ్, భారతీయ జనతాపార్టీ నాయకులు, బోడ్ల రమేష్ రాం శివ, దొ నీకేలా నవీ నవీన్ పీసు రాజేందర్ రమేషయాదవ్,నవీన్,రంజిత్,మిట్టపెళ్లి సాయి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.